నా బాల్యం గుర్తొస్తుంది.. మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్ చేసిన ఉపాసన!

మెగా అభిమానులకి మెగా ప్రిన్సెస్ క్లీంకార అంటే ఉన్న అభిమానం అందరికీ తెలిసిందే. ఆమె పుట్టిన తర్వాత రామ్ చరణ్ కి కలిసి వచ్చిందంటూ కొందరు కామెంట్లు పెట్టారు. మరికొందరు మెగా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ కామెంట్లు పెట్టారు. ఇదే విషయంగా రామ్ చరణ్ స్పందిస్తూ అప్పుడే తన మీద అంత ఒత్తిడి తీసుకురాకండి అంటూ ఒక నేషనల్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మెగా ప్రిన్సెస్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటారు మెగా ఫ్యాన్స్ కానీ ఎక్కడ ఎవరు ఎలాంటి కామెంట్స్ చేస్తారో, ఎక్కడ పాపపై ఒత్తిడి పడుతుందో అని పాప విషయంలో చాలా కేర్ తీసుకుంటారు రామ్ చరణ్ దంపతులు. అందులో భాగంగానే మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఉపాసన. అయితే ఈ మధ్య క్లీంకారా తన తాత ముత్తాతలతో కలిసి అపోలో హాస్పిటల్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో పాల్గొంది.

ముచ్చటైన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్లీంకారా ని తాత చేతుల్లో చూస్తుంటే నా బాల్యం గుర్తుకొస్తుంది. ఈ టెంపుల్ కి నాకు అవినాభావ సంబంధం ఉంది, నాకు ఎంతో ప్రత్యేకమైనది, ఈ ఆలయం ఇవి నాకు వెలకట్టలేని క్షణాలు ఓం నమో వెంకటేశాయ
అని రాసుకొచ్చింది ఉపాసన. అయితే ఉపాసన షేర్ చేసిన ఫోటోలో క్లీంకార ఫేస్ పూర్తిగా రివీల్ కాకపోవటం గమనార్హం.

ఫోటో చూసిన నెటిజన్స్ అప్పుడే మెగా ప్రిన్సెస్ అంత పెద్దది అయిపోయిందా అంటూ హార్ట్ ఎమోజితో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రాంచరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉన్నారు. మెగా ప్రిన్సెస్ పుట్టిన తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటున్నారు మెగా అభిమానులు.