ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలొచ్చాయ్. ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలు. ఈ రెండు సినిమాలూ ఒకే బ్యానర్ మీద రూపొందినప్పటికీ వేర్వేరు సంగీత దర్శకులు పని చేశారు.
ఒకరు తమన్ కాగా, ఇంకొకరు దేవిశ్రీ ప్రసాద్. ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ పేరు మార్మోగిపోతోంది. హిట్లు మీద హిట్లు కొట్టడమే అందుకు కారణం. అయితే, ఈ సారి మాత్రం లెక్క తప్పింది.
సంక్రాంతి సినిమాల్లో ‘వాల్తేర్ వీరయ్య’ బంపర్ విక్టరీ అందుకుంది. ‘వీర సింహారెడ్డి’ ఆ రేస్‌లో కాస్త వెనకబడిపోయింది. ఆ లెక్కల ప్రకారం దేవిశ్రీ ప్రసాద్ రేంజ్ కూడా ఆటోమెటిగ్గా పెరిగిపోయింది. తమన్ రేంజ్ కాస్త తగ్గింది.
అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే మాత్రం తమన్‌దే పై చెయ్యి అంటున్నారు. కానీ, హిట్టు, ఫట్ లెక్క అనేది ప్రామాణికం కదా.. ఆ లెక్కల్లో పాపం తమన్ అన్యాయమైపోయాడంతే.!