Anirudh – GV Prakash : అనిరుధ్‌కు పెరుగుతున్న పోటీ.. జీవీ ప్రకాష్‌ జోరు!

సినిమా పరిశ్రమలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా అనిరుధ్ రవిచందర్ తన మ్యూజిక్‌తో తెలుగు, తమిళ సినీ ప్రియులను ఆకట్టుకుంటూ, టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అయితే, ఇటీవల అతని సంగీతంలో రిపిటేటివ్ ట్యూన్స్ కనిపిస్తున్నాయనే విమర్శలు రావడం, పలుచోట్ల అతని మ్యూజిక్ ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వకపోవడంతో, ఇప్పుడు జీవీ ప్రకాష్ తన క్రేజ్ తో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజికల్ హిట్స్‌ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘అమరన్’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాల్లో ఆయన అందించిన సంగీతం మంచి హిట్‌ కావడంతో, కొత్త ప్రాజెక్టుల కోసం ఆయనను అప్రోచ్ అయ్యే నిర్మాతల సంఖ్య పెరిగింది. మరోవైపు అనిరుధ్ సినిమాలకు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తుండగా, జీవీ ప్రకాష్ 10కోట్ల పారితోషికంతోనే సినిమాలు ఒప్పుకోవడం నిర్మాతలకు కలసి వస్తోంది.

ప్రస్తుతం జీవీ ప్రకాష్‌ చేతిలో అజిత్‌ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ధనుష్‌ ‘ఇడ్లీ కడై’, శివకార్తికేయన్‌ ‘పరాశక్తి’ వంటి సినిమాలతో పాటు, తెలుగులో సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో, ఆయన మ్యూజిక్‌ డిమాండ్ మరింత పెరుగుతోంది.

ఈ క్రమంలో అనిరుధ్ తన మ్యూజిక్‌లో కొత్తదనం తీసుకురాకపోతే, టాప్ పొజిషన్‌ను నిలబెట్టుకోవడం కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగీత ప్రేక్షకులు కూడా కొత్త వేవ్‌ కోరుకుంటున్న తరుణంలో జీవీ ప్రకాష్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. మరి, ఈ పోటీని అనిరుధ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

పోసాని అరెస్ట్ వెనుక కుట్ర || Analyst Purushotham Reddy EXPOSED Posani Arrest || Telugu Rajyam