Anirudh Ravichander: టాలీవుడ్ – అనిరుధ్ స్పీడ్ ఏ రేంజ్ లో ఉందంటే…

తెలుగు సినిమాల్లో అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో స్థానం సంపాదించుకుంటున్నాడు. ఇంతవరకు కోలీవుడ్ లో సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న అనిరుధ్, టాలీవుడ్ లోనూ తన దారిని విస్తరిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ టీజర్ కి అతను ఇచ్చిన బీజీమ్ అందరికీ పూనకాలు తెప్పించింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో అనిరుధ్ మ్యూజిక్ మరో లెవెల్ లో ఉంటుందని అభిమానులు చెబుతున్నారు.

ఇక నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ టీజర్ మార్చి 3న విడుదల కానుంది. ముందుగా ప్రైవేట్ స్క్రీనింగ్ లో ఈ టీజర్ చూసినవారు, అందులోని అనిరుధ్ బీజీమ్ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని అంటున్నారు. ‘దసరా’లో హిట్ ఇచ్చిన ఈ కాంబో, ఇప్పుడు మరింత హై ఓల్టేజ్ కంటెంట్ తో వస్తుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అనిరుధ్ ఇచ్చిన సౌండ్ ట్రాక్ ఈ సినిమాలో పెద్ద ప్లస్ అవుతుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

ఇక చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమా, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ప్రాజెక్టు కోసం కూడా అనిరుధ్ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇంకా ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అగ్రిమెంట్స్ ఫైనల్ అవ్వలేదట. అనిరుధ్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో, తెలుగు సినిమాలకు కేటాయించే సమయాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడని టాక్. తమిళంలో విజయ్ ‘జన నాయగన్’, రజినీకాంత్ ‘జైలర్ 2’, శివకార్తికేయన్ ‘మదరాసి’, కమల్ హాసన్ ‘ఇండియన్ 3’, కార్తీ ‘ఖైదీ 2’ వంటి సినిమాలు ఇప్పటికే అనిరుధ్ చేతిలో ఉన్నాయి.

అంతటి బిజీ షెడ్యూల్ లోనూ అనిరుధ్ తెలుగులో తన మార్క్ చూపించడం నిజంగా దర్శకులపై ఆధారపడి ఉంటుంది. ఆయన్ని ఒప్పించడం ఒక సవాలు అయితే, తన నుంచి బెస్ట్ రాబట్టడం మరింత సవాలు. అయితే ఇప్పటి దాకా వచ్చిన అవుట్ పుట్ చూస్తే, అనిరుధ్ దూకుడు కొనసాగుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సుత్తీ ఆపవమ్మా|| Varudu Kalyani Vs Vangalapudi Anitha || Varudu Kalyani Counter To Vangalapudi || TR