ఇటీవల ఓటీటీలో రిలీజైన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ దగ్గుబాటి ఫ్యామిలీకి ఎక్కడ లేని చెడ్డ పేరు తెచ్చింది. ఫ్యామిలీ హీరో అనే మంచి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసి పాడేసింది వెంకటేష్‌కి ఈ సిరీస్. దాంతో, ఈ మచ్చ వీలైనంత త్వరగా తీర్చేసుకోవాలనుకుంటున్నాడట వెంకటేష్. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో ఓ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు ఈ ఇద్దరూ మొగ్గు చూపుతున్నారట.
సొంత బ్యానర్‌లోనే ఈ ప్రాజెక్ట్ వుండబోతోందని సమాచారమ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా, కావాల్సినంత యాక్షన్ కూడా వుంటుందట ఈ సినిమాలో. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయ్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించనున్నారట.
ప్రస్తుతం వెంకటేష్ ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘సైంధవ్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఓ డిఫరెంట్ యాక్షన్ మూవీ ఇది. బహుశా ఈ సినిమా తర్వాత వెంకీ – రానా కాంబో సెట్స్ మీదికెళ్లనుందేమో చూడాలి మరి. ఈ లోపే ఈ కాంబో ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీకి రానున్నారట బాబాయ్ అబ్బాయ్.