“స్కంద” స్పెషల్ హాట్ నెంబర్ కి ముహూర్తం ఖరారు..!

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ఏదన్నా ఉంది అంటే అది యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్నా భారీ ఏక్షన్ అండ్ ఫామిలీ డ్రామా “స్కంద” కూడా ఒకటి.

మరి ఈ సినిమా నిజానికి నిన్న సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉంది కానీ మేకర్స్ ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. అయితే ఈ గ్యాప్ లో మాత్రం ఈ సినిమా నుంచి ఓ కంప్లీట్ కాంట్రాస్ట్ క్రేజీ నెంబర్ ని రిలీజ్ చేయడానికి అయితే సిద్ధం చేశారు.

మరి ఈ సినిమాలో రీసెంట్ గా టాలీవుడ్ లో బిజీగా మారిన బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ ఊర్వశి రౌటేలాతో ప్లాన్ చేసిన మాస్ అండ్ ఐటెం సాంగ్ కి ఇప్పుడు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. కాగా ఈ సాంగ్ కి కల్ట్ మామ అనే పేరు పెట్టి రామ్ పోతినేని నుంచి ట్రైలర్ లో రివీల్ చేసిన షాకింగ్ లుక్ లో అయితే ఇది ఉంటుంది అని రివీల్ చేశారు.

ఇప్పటికే థమన్ మంచి మూడు సాంగ్స్ ఇచ్చాడు అలాగే ఐటెం సాంగ్స్ కోసం అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులోని బోయపాటి సినిమాలకి అయితే మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. కాగా ఈ స్కంద కి మాత్రం ఎలాంటి సాంగ్ ఇచ్చాడో చూడాలి. అలాగే ఊర్వశి అయితే ఈ ఏడాదిలోనే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య పవర్ స్టార్ బ్రో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో అయితే మెరిసి మెస్మరైజ్ చేసింది. ఇక స్కంద లో తన గ్లామ్ షో ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 
https://x.com/SS_Screens/status/1702976207573446929?s=20