నమ్రత నన్ను మరిచిపోయింది.. ఎంఎస్ రాజు ట్వీట్ వైరల్

MS Raju about Namrata Shirodakar tweet on 18 years of Okkadu

ఎంఎస్ రాజు ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఆటాడేసుకుంటున్నాడు. డర్టీ హరి చిత్రంతో మంచి ఫాంలోకి వచ్చిన ఈ దర్శక నిర్మాత నెటిజన్లతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు వేసే ప్రశ్నలకు సమాధానాలు, కౌంటర్లకు రివర్స్ కౌంటర్లు వేస్తున్నాడు. ఇలా ఎంఎస్ రాజు నిత్యం సోషల్ మీడియాలోనే గడుపుతున్నాడు. అయితే ఎంఎస్ రాజు నిర్మించిన మరుపురాని చిత్రాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలిసిందే.

MS Raju about Namrata Shirodakar tweet on 18 years of Okkadu
MS Raju about Namrata Shirodakar tweet on 18 years of Okkadu

ఆయన నిర్మించిన ఒక్కడు సినిమాకు పద్దెనిమిదేళ్లు నిండాయి. ఈ క్రమంలో ఎంఎస్ రాజు నాటి సంగతులనుగుర్తుకు చేసుకున్నాడు. మహేష్ బాబు, గుణ శేఖర్, మణిశర్మ, భూమిక ఇలా అందర్నీ గుర్తు చేసుకుంటూ ట్వీట్లు పెట్టేశాడు. అదే సందర్భంగా నమ్రత కూడా తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో మొదటగా ఎం ఎస్ రాజు గురించి ప్రస్తావించలేదు. ఒక్కడు సినిమా గురించి చెబుతూ భూమిక, గుణ శేఖర్, మణిశర్మల గురించి మాత్రమే చెప్పింది.

అలా తన పేరును మరిచిపోవడంపై ఎంఎస్ రాజు హర్ట్ అయ్యారు. నమ్రత గారు నా పేరు ప్రస్థావించడం మరిచిపోయారు. అయినా నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఇది ఆమెకు ఇష్టమైన సినిమా అని చెప్పారంటూ ఎంఎస్ రాజు ట్వీట్ చేశాడు. కానీ నమ్రత మళ్లీ ఎంఎస్ రాజు పేరును యాడ్ చేసింది. మొత్తానికి తన తప్పును సరిదిద్దేసుకుంది. అయితే ఎంఎస్ రాజు మాత్రం దాన్ని ఇంకా గమనించినట్టు కనిపించడం లేదు.