మృణాల్ ఠాకూర్.. చరణ్ సినిమాలో?

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో తెలిసిన విషయమే. అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అయితే ఇప్పుడాయన RC15తో బిజీగా గడుపుతున్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా భారీగా నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత RC16.. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్చరణ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రం కబడ్డీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రానుందని అప్పట్లో బాగా ప్రచారం కూడా సాగింది. అలానే ఇది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని కూడా టాక్ వినిపిస్తోంది. ఓకవేళ ఇది లవ్ స్టోరీ అయితే.. చాలా కాలం తర్వాత చరణ్ పూర్తిస్థాయిలో ప్రేమకథలో నటించినట్లు అవుతోంది. అయితే ఈ సినిమా మిగతా నటీనటుల వివరాలు ఇంకా బయటకి రాలేదు.

కానీ ఇప్పుడు తాజాగా.. RC16 సినిమాలో రామ్ చరణ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుందని ప్రచారం సాగుతోంది. సీతారామం లాంటి సూపర్ లవ్ స్టోరీలో దుల్కర్ సల్మాన్కు జోడీగా మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు దోచింది. దీంతో ఆమెకు ఆఫర్లు పెరిగిపోయాయి. అలా ఆమె రీసెంట్గా నాని 30వ సినిమాకు ఓకే చెప్పింది. ఇటీవలే ఈ సినిమా షూట్ ప్రారంభమైనట్లు సమాచారం.

అయితే ఇప్పుడు మృణాల్ ఠాకూర్.. రామ్ చరణ్ RC16 సినిమా ఒప్పుకున్నట్టు సమాచారం అందుతోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ఇక ఈ వార్త తెలుసుకుంటున్న సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉప్పెన’ లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీని తెరకెక్కించి.. తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన.. ఈ సారి కూడా మెగా పవర్ స్టార్తో మంచి సినిమాను తెరకెక్కిస్తాడని ఆడియెన్స్ను ఆశిస్తారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.100కోట్ల బడ్జెట్తో రూపొందుతుందని సమాచారం.