తన రిలేషన్ షిప్ స్టేటస్ పై ఓపెన్ అయ్యిన మృణాల్ ఠాకూర్..!

టాలీవుడ్ సినిమా దగ్గర తమ మొదటి సినిమా తోనే సూపర్ సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ లో బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. మరి అలా వచ్చి తమ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ “సీతారామం” తో అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు.

కాగా ఈ యంగ్ హీరోయిన్ మొదటి సినిమాతోనే అంత పెద్ద హిట్ కొట్టాకా ఈమె హిందీలో కూడా మరిన్ని భారీ సక్సెస్ లు అందుకోగా తెలుగులో కూడా మరిన్ని సాలిడ్ ఆఫర్స్ ని ఆమె అందుకుంది. అయితే మృణాల్ ఠాకూర్ అక్కడ యూత్ లో కూడా మంచి క్రష్ గా నిలవగా మరి మృణాల్ కమిటెడ్ నా కాదా లవర్ ఉన్నాడా లేదా అనేది కూడా చాలా మందిలో ఉంది.

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో అయితే తన రిలేషన్ షిప్ స్టేటస్ కోసం ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం అయితే అయితే తాను ఎలాంటి రిలేషన్ షిప్ లోని లేను అని అలాగే ఏ బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అని ఆమె కన్ఫర్మ్ చేసింది. అయితే ఆమెకి మాత్రం ప్రముఖ హాలీవుడ్ హీరో జాన్ వీక్ సిరీస్ ఫేమ్ కీను రీవ్స్ అంటే క్రష్ అని మాత్రం తెలిపింది. అంతే తప్ప ప్రెజెంట్ అయితే తాను సింగిల్ గానే ఉన్నానని మృణాల్ చెప్పుకొచ్చింది. సో ప్రెజెంట్ అయితే ఈ సీత ఇంకా తన రాముని వేటలోనే ఉందని చెప్పాలి.