ఈ హీరో సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసిన సీత.?

main-image-credit--Mrunal-Thakur-Instagram_63b28edea6914

టాలీవుడ్ సినిమా దగ్గర ఒక ప్యూర్ చిత్రంతో అయితే మంచి డెబ్యూ ఇవ్వడం హీరోకి గాని హీరోయిన్ కి గాని చాలా రేర్ అని చెప్పాలి. కాగా హీరోయిన్ కి అయితే ఇంకా కష్టం అని చెప్పాలి. పక్కాగా గ్లామ్ షో లేకుండా కొత్త సినిమా రావాలి అంటే కూడా ప్రశ్నే.

మరి ఇవన్నీ దాటుకొని టాలీవుడ్ కి సీతగా సీతారామం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అయితే ఆమె అవ్వడానికి హిందీ హీరోయిన్ అయ్యినా ఆమెకి హిందీలో రాని బ్రేక్ మన టాలీవుడ్ లో దక్కింది. ఇక దీనితో టాలీవుడ్ లో మంచి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న మృణాల్.

వెంటనే నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా అయితే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. కాగా వీరిలో అయితే విజయ్ దేవరకొండ తో సినిమాలో నటించేందుకు ఆమె తన రెమ్యునరేషన్ ని హైక్ చేసినట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా ఈ ఒక్క చిత్రానికి ఈమె ఏకంగా మూడున్నర కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో రీసెంట్ గా వచ్చిన హీరోయిన్స్ లో ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే రీసెంట్ గానే యూఎస్ లో సినిమాకి లొకేషన్ వేటని కంప్లీట్ చేసిన మేకర్స్ అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టుగా కంఫర్మ్ చేసారు.