మృణాల్ ఠాకూర్ భయపెడుతోంది.!

వరుసగా నాలుగైదు సినిమాల్లో నటిస్తేనో, లేదంటే, ఐదారు హిట్లూ సూపర్ హిట్టూ పడితేనో ఒకప్పుడు హీరోయిన్లకు క్రేజ్ దక్కేది. కానీ, ఇప్పుడు కాలం మారింది. ఒక్క సినిమాతోనే విపరీతమైన స్టార్‌డమ్ వచ్చేస్తోంది. అలాగే, ఒక్క ఫ్లాప్ వచ్చిందా.? కష్టపడి దక్కించుకున్న స్టార్‌డమ్ కాస్తా గంగలో కలిసిపోతోంది.

ఆ చందంగా వుంది ప్రస్తుతం ముద్దుగుమ్మల పరిస్థితి ఇండస్ర్టీలో. అయితే, మృణాల్ ఠాకూర్ విషయంలో మరోలా జరుగుతోంది. మృణాల్ నటించిన ‘సీతారామం’ సినిమా సూపర్ డూపర్ హిట్. సంచలన విజయాన్ని అందుకుంది. మృణాల్ పాత్రకూ మంచి పేరు దక్కింది.

అంతా బాగానే వుంది. కానీ, ఆ తర్వాత ఇంతవరకూ మరో సినిమా రిలీజ్ కాలేదు మృణాల్ నుంచి. అయినా కానీ, ఆమెకున్న క్రేజ్ చూస్తే వేరే లెవల్. ఈ క్రేజ్‌తోనే పాప రెమ్యునరేషన్ బాగా పెంచేసిందంటూ ప్రచారం జరుగుతోంది.

అస్సలు అందట్లేదట మృణాల్ ఠాకూర్. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. క్రేజ్ వున్నప్పుడే క్యాష్ చేసుకోవాలి మరి, మృణాల్ చేస్తున్నది కూడా ఇదే కాబోలు. కోటి అంతకు మించి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట మృణాల్ ఠాకూర్.

మృణాల్ చెబుతున్న ఫిగర్ చూసి నిర్మాతలు ధడేల్‌మంటున్నారట. మరీ ఇంతలా చేస్తే మృణాల్ ముందు ముందు కెరీర్ ఎలా వుండబోతోంది.? ఏం పర్లేదు.. క్రేజ్ వుంటే, కెరీర్‌లో ఢోకా వుండదుగా.!