ఇది మరీ టూ మచ్ మృణాల్.!

టాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అని మృణాల్ ఠాకూర్‌పై ఓ ప్రచారం జోరందుకుంది. ‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.

తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో నటిస్తోంది. అలాగే, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతోనూ ఓ సినిమాలో నటిస్తోంది.

కాగా, తాజా ప్రచారంతో మృణాల్ రేంజ్‌ని బాగా పెంచేస్తున్నారు. నిజంగానే మృణాల్‌కి అంత సీనుందా.? అంటే ఇది మునగచెట్టు ఎక్కించి పాతాళానికి నెట్టేయడమే అవుతుందనాలేమో. నిఖార్సయిన కమర్షియల్ హిట్ ఒక్కటైనా కొట్టాల్సి వుంది మృణాల్ ఠాకూర్.

కృతి శెట్టి విషయంలోనూ ఇదే జరిగింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కొల్లగొట్టడంతో, ఇంకేముంది రెమ్యునరేషన్ పెంచేసిందంటూ కృతి శెట్టిపై బ్యాడ్ ప్రచారం జోరందుకుంది.

ఫెయిల్యూర్స్ వెంటాడడం.. ఈ తరహా దుష్ర్పచారం అన్నీ వెరసి ప్రస్తుతం కృతి శెట్టి కెరీర్ ఖతమైపోయిన దుస్థితి ఏర్పడింది. మృణాల్ విషయంలోనూ అంతే, ఒక్క ఫ్లాప్ కానీ పడిందంటే కెరీర్ గల్లంతే. ఇలాంటి ప్రచారాల విషయంలో మృణాల్ కూసింత జాగ్రత్తగా వుంటే మంచిదని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట.