ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. దరిదాపుల్లో కూడా లేని పోటీ చిత్రాలు!

ఈ సంవత్సరం సంక్రాంతి పెద్ద సినిమాలు విడుదలతో కలర్ ఫుల్ గా ఉండబోతుంది. హెవీ బడ్జెట్ తో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ మూవీ, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్, వెంకీ మామ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వీటితోపాటు కొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే గట్టి పోటీ మాత్రం గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.

అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మినహాయిస్తే మిగిలిన రెండు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. బడ్జెట్ పరంగా వెంకీ మామ సినిమా చిన్నదనే చెప్పాలి అయితే ప్రమోషన్స్ విషయంలో, ప్రజలకి రీచ్ అయ్యే విషయంలో ఈ సినిమా ఎక్కువగా హైప్ క్రియేట్ చేస్తుంది. దీనికి ముఖ్య కారణం దర్శకుడు అనిల్ రావిపూడి క్రియేటివిటీ తోపాటు వెంకీ యాక్టివ్ నెస్ తోడయ్యింది. సినిమా ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా క్రియేట్ చేయడంలో అనిల్ రావిపూడి ఎప్పుడూ ముందుంటాడు.

సినిమాలోని మొదటి పాటని రమణ గోగులతో పాడించి సినిమా పై మంచి హైప్ ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వెంకటేష్ తో పాట పాడించేందుకు చేసిన హడావుడి రీల్స్ ద్వారా ప్రజల వద్దకు చేర్చడానికి అతని ప్రమోషన్స్ బాగా ఉపయోగపడ్డాయి. ఇక వెంకీ పాడిన పాట తాలూకా ట్రైలర్ కూడా సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది.

వెంకీ మామ కూడా గతంలోలా బిడియంగా కాకుండా ఈ సినిమా కోసం చాలా యాక్టివ్గా ఉంటున్నాడు, ప్రమోషన్స్ లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. నేను పాడతాను అంటూ అనిల్ రావిపూడి వెంటపడి వెంకటేష్ చేసిన హడావుడి ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్ ఇచ్చింది. ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే డాకు మహారాజ్ కానీ, గేమ్ చేంజర్ మూవీ కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి దరిదాపుల్లో కూడా లేవు. ఇక సినిమా రిజల్ట్స్ పరంగా ఏమాత్రం పోటీ ఇస్తాయో చూడాల్సిందే.