రాజకీయాల్లోకి పోటెత్తనున్న సినీ గ్లామర్.!

రాజకీయాల్ని శాసించిన సినీ ప్రముఖులెందరో వున్నారు. అయినా కానీ, రాజకీయాల్లో సినీ జనాలంటే చిన్న చూపే ఎప్పుడూ.! అయితే, ఇకపై అలా కుదరకపోవచ్చు.

సినీ ప్రిశ్రమకి చెందిన చాలా మంది ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో సినీ ప్రముఖుల శాతం పెరగబోతోందని తెలుస్తోంది.

అందునా నటీమణుల శాతం పెరగబోతోందట. అవునండీ పెద్ద సంఖ్యలో అందాల భామలు అనబడే ముద్దుగుమ్మలు రాజకీయాల్లో సందడి చేయబోతున్నారట.

టాలీవుడ్ నుంచే దాదాపు 15 నుంచి 20 మంది పాపులర్ నటీ మణులు తెలుగు రాష్ర్టాల రాజకీయ తెరపై వెలుగులు విరజిమ్మబోతున్నారట.

వచ్చే ఎన్నికల్లో రాజకీయ తెరపై తమదైన గ్లామర్ హవాతో ప్రభావితం చేయబోతున్నారట. ఈ సంఖ్య వచ్చే ఎన్నికల నాటికి రెండింతలో, మూడింతలో కాదు. దాదాపు ఐదింతల వరకూ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

అయితే, ఆ నెంబర్ ఇప్పుడప్పుడే కన్‌ఫామ్ చేస్తే అది తొందరపాటే అవుతుంది. ప్రధమంగా టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ హీరోయిన్లు ప్రధాన రాజకీయ పార్టీల వైపు చూస్తున్నారనీ వినికిడి.

ఎవరా పాపులర్ స్టార్ హీరోయిన్లు.? ఏంటా రాజకీయం.? అనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేస్తే సరిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!