ఆస్కార్ అవార్డు విజేత, సంగీత దర్శకుడు, ఎన్నో క్లాసిక్ ఆల్బమ్స్ ని అందించిన ఏ ఆర్ రెహమాన్ ని అందరూ మ్యూజికల్ గాడ్ గా చెప్తారు. ఇప్పటివరకు కొత్త కొత్త ట్యూన్స్ అండ్ బీట్స్ తో అలరిస్తూ వస్తున్న ఏ ఆర్ రెహమాన్ జీవితంలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఇటీవల ఏఆర్ రెహమాన్, సైరబాను దంపతులు తమ 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.
అయితే అదే రోజు ఏ ఆర్ రెహమాన్ అసిస్టెంట్ మోహినిదే కూడా తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఓ వార్త సినీ పరిశ్రమంలో షికార్లు చేసింది. ఆమె కారణంగానే రెహమాన్ సుమారు తమ 29 ఏళ్ల కాపురానికి తిలోదకాలు ఇచ్చేసాడని సోషల్ మీడియాలో చాలామంది రెహమాన్ పై ఫైర్ అయ్యారు. అయితే దీనిపై రెహమాన్ స్పందిస్తూ తనపై తప్పుడు వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేశాడు.
అలాగే రెహమాన్ భార్య కూడా నా భర్తని ఏమీ అనొద్దు అతను చాలా మంచివాడు అంటూ భర్తని వెనకేసుకొచ్చింది. ఇంత జరిగినప్పటికీ మోహినిదే ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. అయితే తాజాగా ఆమె కూడా ఈ సంఘటన పై స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. రెహమాన్ గారికి తనకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన నన్ను ఎప్పుడూ ఒక కూతురుగానే ట్రీట్ చేశారు, అందుకే నాకు ఆయన తండ్రితో సమానం అని చెప్పింది.
ఆమె రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక కొసమెరుపు ఏమిటంటే ఆమె రెహమాన్ బ్యాండ్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమె యుఎస్ లో సెటిల్ అయిందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎవరి గురించైనా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి అంటారు. ఇప్పటికైనా విమర్శలు చేసేవారు నిజానిజాలు తెలుసుకొని కామెంట్స్ చేయాలి అంటున్నారు నెటిజన్స్.