ధ్రువ సీక్వెల్ ఆలోచనలో మోహన్ రాజా.. త్వరలోనే సెట్స్ పైకి?

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధ్రువ. రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ సినిమా తమిళంలో మోహన్ రాజ దర్శకత్వంలో వచ్చిన  ‘తనీ ఒరువన్‌’ సినిమాకు రీమెక్ చిత్రం. ఇలా తమిళ సినిమాకు రీమేక్ చిత్రంగా వచ్చినటువంటి ధ్రువ సినిమా తెలుగులో ఎంత మంచి విజయం సాధించింది.

ఇకపోతే తమిళంలో తెరకెక్కిన తనీ ఒరువన్‌ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్లాన్ చేయాలనే ఆలోచనలో మోహన్ రాజా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోని ఈ సినిమా కథను కూడా ఇప్పటికే ఈయన రామ్ చరణ్ కు వినిపించగా రాంచరణ్ కూడా ధ్రువ సినిమా సీక్వెల్ చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఈయన తెలియజేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియాల్సి ఉంది.

ఇక పోతే మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయం కావడంతో మోహన్ రాజ తన తదుపరి సినిమాలపై దృష్టి సాధించారు. ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందు కూర్చున్న ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.