ఆ సంవత్సరంలోనే మోహన్ బాబు చనిపోయేవారు…. షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ జర్నలిస్ట్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే ఈయన విలక్షణ నటుడిగా మాత్రమే కాకుండా హీరోగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్టు భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు.ముఖ్యంగా 1997 సంవత్సరంలో జరిగిన బాంబు దాడి ఘటనలో మోహన్ బాబు చనిపోవాల్సి వచ్చిందంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంటర్వ్యూ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షన్ బీభత్సంగా ఉండేది ముఖ్యంగా అనంతపురంలో పరిటాల రవి మద్దెల చెరువు సూరి మధ్య ఎలాంటి ఫ్యాక్షనిజం ఉండేదో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మద్దెల చెరువు సూరి టీవీ బాంబు ఘటనలో పరిటాల రవిని హతమార్చాలని భావించారు. ఈ దాడి నుంచి పరిటాల రవి బయటపడగా మద్దెల చెరువు సూరి ఈ ఘటనపై జైలు పాలయ్యారు. ఈయన జైలులో ఉంటూనే రవి హత్యకు కుట్ర చేశారు.

ఈ క్రమంలోని పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య జీవిత కథ ఆధారంగా పెరికెక్కిన శ్రీరాములయ్య సినిమా షూటింగ్ సమయంలో పరిటాల రవినీ హతమార్చాలని సూర్య ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల వేడుక రామనాయుడు స్టూడియోలో జరిగింది. ఈ వేడుక అనంతరం తిరిగి వెళ్లే సమయంలో పరిటాల రవిని హత్య చేయాలని సూరీ పథకం పన్నారు.ల్యాండ్ మైన్ పేల్చి పరిటాల రవిని హతమార్చాలని చూశారు.ఈ వేడుకనుంచి పరిటాల రవి మోహన్ బాబు పరిటాల రవి బావగారు ఒకే కారులో వెళ్తున్నారు. అలాగే మరొక వాహనంలో మీడియా వారు సుమారు 24 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు.

ఇకపోతే మీడియా అనుచరులు పరిటాల రవి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసి వెళ్లడంతో ల్యాండ్ మైన్ పేలి 24 మంది మీడియా బృందం మరణించారు.లేకపోతే 1997 వ సంవత్సరంలోనే ఆ ల్యాండ్ లైన్ మోహన్ బాబు గారు చనిపోయేవారని అదృష్టవశాత్తు వీరు తప్పించుకున్నప్పటికీ 24 మంది మీడియా ప్రతినిధులు మరణించారని భరద్వాజ్ పేర్కొన్నారు. ఈ విధంగా మోహన్ బాబు గురించి భరద్వాజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.