Kannappa: ‘భక్తకన్నప్ప’లో మోహన్‌బాబు మనమరాళ్లు ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Kannappa: మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విష్ణుతో పాటు, మోహన్‌ బాబు, అక్షయ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, ముఖేష్‌ రిషి తదితర ప్రముఖుల ఫస్ట్‌ లుక్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరిని పరిచయం చేసింది. ఈ సినిమాలో ఇప్పటికే మంచు విష్ణు కొడుకు నటిస్తుండగా.. తాజాగా మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు అయిన అరియానా, వివియానా ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు.

సోమవారం అరియానా, వివియానా పుట్టినరోజు సందర్భంగా.. ఈ విషయాన్ని మోహన్‌ బాబు తెలుపుతూ.. ‘కన్నప్ప’ సినిమాతో నా మనవరాల్లు అరియానా, వివియానా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నాను. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది. పరిశ్రమలో వారికి గుర్తింపురావాలని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా అని మోహన్‌ బాబు రాసుకొచ్చారు.