MLA Roja: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రిన్స్ లాగనే అందరికీ ఆదర్శంగా ఉంటున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని రియల్ లైఫ్ శ్రీమంతుడు అయ్యాడు. చాలా కాలంగా మహేష్ ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లల ఆరోగ్యం కోసం పాటు పడుతున్నారు. హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న పిల్లలకు అవసరమైన వైద్య చికిత్స అందించి, హార్ట్ సర్జరీ లు ఉచితంగా చేయిస్తున్నారు. ఇప్పటికీ వెయ్యికి పైగా హార్ట్ సర్జరీ లు చేయించారు, కానీ ఇప్పటి వరకు దీని గురించి ఆయన చెప్పుకోక పోవడం గమనార్హం.
హృదయ సంబంధ వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ఆయన మహేష్ బాబు పౌండేషన్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించారు.చిన్నారుల హార్ట్ సర్జీల నిమిత్తం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే రెయిన్‌బో, ఆంధ్రా హాస్పటల్స్‌తో కలిసి పనిచేస్తున్నారు.మహేష్ బాబు తన అబ్బాయి గౌతమ్ పుట్టినపుడు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినట్టు బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ప్రస్తావించారు. తనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే పేదవాళ్లు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారా ఆలోచనతో మహేష్ బాబు ఫౌండేషన్ స్టార్ట్ చేశానని తన సేవకు గల కారణాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫౌండేషన్ మరింత విస్తృత మా అవుతోంది.
రెయిన్‌బో హాస్పటల్‌కు చెందిన లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయేనున్నామని సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రకటించారు. తద్వారా ఇంకా చాలామంది పిల్లలకు వైద్యం అందించవచ్చు అని ఆయన ప్రకటించారు.చిన్నారులు ఎప్పుడూ తన మనస్సుకు చేరువగా ఉంటారని..కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు ఫౌండేషన్ ద్వారా తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందని మహేష్ బాబు అన్నారు.
మహేష్ బాబు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రోజా దీనిపై స్పందిస్తూ చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేష్ నీకు హ్యాట్సఫ్ అంటూ రోజా ట్వీట్ చేసి మహేష్ బాబు అని ప్రశంసించింది.బండ్ల గణేష్ కూడా దీనిపై స్పందిస్తూ రోజా చేసిన ట్వీట్ ని తిరిగి ట్వీట్ చేశారు.