ఓటిటిలోకి ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ పోలిశెట్టి’… 5నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా వస్తా అనే డైలాగ్‌ నవీన్‌ పొలిశెట్టికి ఆప్ట్‌గా సూటవుతుంది. ఏజెంట్‌ శ్రీనివాస్‌ ఆత్రేయ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చిన ఈ కుర్ర హీరో తొలి సినిమాతోనే బంపర్‌ హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని జాతిరత్నాలుతో వచ్చాడు.

ఈ సినిమా ఊహించని రేంజ్‌లో కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని ఇటీవలే మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టితో వచ్చాడు. ఇదేకంగా రూ.50 కోట్లు కొల్లగొట్టి నవీన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్టుగా నిలిచింది. ఇలా రెండేళ్లకొకసారి వచ్చి బాక్సాఫీస్‌ దగ్గర భారీ హిట్టు కొడుతూ వంద శాతం సక్సెస్‌ రేషియో ఉన్న హీరోగా నిలిచాడు.

ఇక ఇటీవల విడుదలైన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాల్లేవు. రిలీజ్‌ డేట్‌లో మార్పులు, టీజర్‌, ట్రైలర్‌లు సైతం మరీ అంత ఎగ్‌జైట్‌చేసేలా లేకపోవడం.. ఇవన్నీ పక్కన పెడితే ఏకంగా షారుఖ్‌ సినిమాతో పోటీగా దిగడం వంటివి.. ఇవన్నీ చూస్తే మిస్‌ శెట్టి సినిమా చుట్టూ నెగెటీవ్‌ వైబ్స్‌ కనిపించాయి. తీరా రిలీజయ్యాక సినిమాకు పాజిటీవ్‌ టాక్‌ రావడంతో మిస్‌ శెట్టి కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ అందుకుంది.

ఇక ఓవర్సీస్‌లో ఫస్ట్‌ వీకెండ్‌ ముగిసేలోపే మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను అందుకుని సంచలనం సృష్టించింది.ఇప్పటికీ ఈ సినిమాకు డీసెంట్‌ కలెక్షన్‌లు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అక్టోబర్‌ 5 నుంచి స్టీమ్రింగ్‌ కానుంది. మహేష్‌ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.