మైండ్ బ్లాక్ చేస్తున్న “హనుమాన్” ప్రీబుకింగ్స్.!

చాలా కాలం తర్వాత టాలీవుడ్ సినిమా నుంచి మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి రాబోతున్న సినిమా అది కూడా పాన్ ఇండియా లెవెల్లో చిన్న సినిమా అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ కలిగించిన సినిమా “హనుమాన్” ఇప్పుడు ఎట్టకేలకి రాబోతుంది.

హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వస్తున్నా రెండో సినిమా ఇది కాగా తెలుగు సినిమా నుంచి మొదటిసారి సూపర్ హీరో నేపథ్యంలో వస్తున్నా సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక టాలీవుడ్ లో అయితే రిలీజ్ పరంగా పలు ఇబ్బందులు ఈ సినిమాకి ఎదురైనప్పటికీ మేకర్స్ చేసిన చిన్న ప్లానింగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

కాగా ఓ రోజు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ప్రీమియర్ సేల్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కూడా రాని భారీ స్థాయి రెస్పాన్స్ హనుమాన్ కి నమోదు అయ్యింది. దాదాపు అన్ని చోట్ల కూడా రికార్డు బుకింగ్స్ నమోదు చేస్తున్న ఈ చిత్రం ఈ విధంగా ప్రీ బుకింగ్స్ లో అయితే అత్యధిక నెంబర్ సోల్డ్ అవుట్ అయ్యిన షో కలిగిన సినిమాగా నిలిచింది.

కాగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్న మైత్రి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మొత్తం 383 స్క్రీన్స్ లో సోల్డ్ అవుట్ అయితే ఇంకా 76 షోస్ ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు. దీనితో హనుమాన్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందా అని చాలా మంది ట్రేడ్ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం హనుమాన్ మేనియా మొదటిరోజు గట్టిగానే ఉందని చెప్పాలి. కానీ రెండో రోజు అంటే రిలీజ్ రోజు మాత్రం సినిమా బుకింగ్ యావరేజ్ గానే ఉన్నాయి. ఇక్కడ గుంటూరు కారం ఎఫెక్ట్ అయితే సినిమాపై పడింది.