ఓటిటి : ఈ ప్లాట్ ఫామ్ లో సడెన్ గా వచ్చేసిన “మేమ్ ఫేమస్”

టాలీవుడ్ సినిమా దగ్గర ఓ అప్ కమింగ్ హీరో గాని దర్శకుడు గాని ఊహించని గట్టి వెల్కమ్ అందుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి లాంటి వాళ్ళని మెప్పించి తన సినిమా నచ్చేలా చేయడం మరో బిగ్ థింగ్ అని చెప్పొచ్చు.

కాగా అలా చేసిన వన్ అండ్ ఓన్లీ యంగ్ నటుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది సుమంత్ ప్రభాస్ అని చెప్పాలి. ఈ యంగ్ నటుడు హీరోగానే కాకుండా దర్శకునిగా కూడా పరిచయం అవుతూ చేసిన లేటెస్ట్ సినిమానే “మేమ్ ఫేమస్”. కాగా ఈ చిత్రం భారీ హిట్ అయ్యి మంచి లాభాలు తీసుకొచ్చింది.

మెయిన్ గా యూత్ ని బాగా అట్రాక్ట్ చేసి అదరగొట్టగా మంచి లాంగ్ రన్ కూడా తెలుగు స్టేట్స్ లో చూసింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఆకస్మికంగా ఓటిటి లో దర్శనం ఇచ్చింది. ఈరోజు నుంచే ఈ సినిమా ఓటిటి లో అందుబాటులోకి వచ్చేసింది.

కాగా ఈ సినిమా అయితే ఏ ప్లాట్ ఫామ్ లో ఉందంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని ఇప్పుడు ఆడియెన్స్ చూడవచ్చు. అయితే ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఈ సినిమా ప్రైమ్ వీడియోలో వచ్చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఈ సినిమా కోసం అప్పుడు థియేటర్స్ లో ఎందుకులే తర్వాత చూద్దాం అనుకునేవారికి ఇపుడు బెస్ట్ ఆప్షన్ దక్కినట్టే అని చెప్పుకోవాలి.