మెగాస్టార్ సరసన  ఆ హీరోయిన్ ఎవరో?

Megastar Chiranjeevi
వి.వి. వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.  అయితే ‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో హీరోయిన్ క్యారెక్టర్  లేదు.
Megastar Chiranjeevi
 
అయితే మెగా ఫ్యాన్సును దృష్టిలో పెట్టుకుని ఓ మాస్ సాంగ్ కోసం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను సృష్టిస్తున్నారట. కాకపోతే హీరోయిన్ పాత్ర నిడివి ఎంత ఉంటుందనేది ఇంకా తెలియలేదు.  హీరోయిన్ ను సాంగ్ కు మాత్రమే పరిమితం చేస్తారా? లేక కథలో  భాగంగా కలుపుతారా? అనేది చూడాలి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో? ఇంకా తెలియరాలేదు.
 
ఈ చిత్రం కోసం వి.వి. వినాయక్  రచయిత ఆకుల శివతో మాటలు రాయిస్తున్నాడట. అలాగే మరో స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా కూడా ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్కులో  నిమగ్నమయ్యాడట. వినాయక్ కి మెగాస్టార్    అవకాశమిచ్చాడనగానే ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇలాంటి స్క్రిప్ట్ లను వినాయక్ బాగా హ్యాండిల్ చేస్తారు. పైగా వినాయక్ ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. చూద్దాం ఆ హీరోయిన్ ఎవరో?,  మెగాస్టార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని దర్శకుడు  వి వి వినాయక్  ఎలా నిలబెట్టుకుంటాడో చూడాల్సిందే!?
Lucifer Malayalam Poster