‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ కసరత్తు!

చిరంజీవి తన తదుపరి సినిమా దర్శకుడు మల్లిడి వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఒక చిన్న ప్రచార వీడియోని విడుదల చేస్తే అది ఎంత పెద్ద వైరల్‌ అయిందో కూడా తెలిసిన విషయమే. చిరంజీవి ఈ సినిమా కోసం కొన్ని రోజుల నుండి జిమ్‌ కి వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.

అసలు ఈ వయస్సులో చిరంజీవి ఉత్సాహం, అతను కసరత్తులు చేస్తున్న తీరు చూస్తుంటే ఒక యువ నటుడులా కనపడుతున్నారు. అతను అంత చురుకుగా చేస్తున్న ఆ కసరత్తుల వీడియో ఇప్పుడు విడుదల చేశారు, ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడొస్తున్న యువనటులకు చిరంజీవి ఈ వయసులో కూడా చేస్తున్న ఇటువంటి కసరత్తులు స్ఫూర్తినిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

సినిమా చేస్తున్నప్పుడు ఎంత కష్టపడాలో చిరంజీవిని ఈ వీడియోలో చూస్తే అర్థం అవుతుంది. అతనే ఎన్నోమార్లు అన్నారు, కష్టపడకుండా చెయ్యకపోతే ఎటువంటి ఫలితం రాదు అని. మొదటి షెడ్యూల్‌ లో భాగంగా సుమారు రెండు వారాలపాటు ఈ ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌ లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది.