గాసిప్స్ : మెగా ఫ్యాన్స్ కి మరో షాకివ్వబోతున్న చిరంజీవి??

chiranjeevi-ravi-teja-starrer-titled-waltair-veerayya-001 (1)

ఇప్పుడు ట్రెండ్ బాగా మారిపోయింది. సినిమాలో చాలా ఆడియెన్స్ అభిరుచులు కూడా మారడంతో ప్రతీ సారి కూడా రొటీన్ సినిమాలని ఆదరించట్లేదు. అలా చాలా సినిమాలు ప్లాప్ లు అయ్యాయి అలాగే రీమేక్ అంటూ చేసిన చిన్న పెద్ద సినిమాలు అన్నీ కూడా యావరేజ్ లు గానే నిలిచిపోయాయి.

మన టాలీవుడ్ లో ఇక రీమేక్ లు అంటే మొదటగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్, వెంకీ మామ లాంటి హీరోలు ముందు వరస లో ఉంటారు. ఇప్పటికీ పాత ట్రెండ్ లోనే ఉన్న వీరు లేటెస్ట్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే చిరంజీవి ట్రాక్ మార్చాడు డైరెక్ట్ సినిమాలు చేస్తున్నాడు.

అలా వాల్తేరు వీరయ్య హిట్ కొట్టాడు అనుకునే లోపే తన ఫ్యాన్స్ కి మెగాస్టార్ ఓ గుదిబండ వేసినట్టే గాసిప్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఈసారి మెగాస్టార్ మరో అద్భుత చిత్రాన్ని రీమేక్ సినిమా చేయబోతున్నారట. మరి ఈ చిత్రం కూడా తమిళ సినిమా అందులో ఇప్పుడు చేస్తున్న వేదాళం సినిమా హీరో అజిత్ నటించిన “విశ్వాసం” సినిమాకి రీమేక్ చేస్తున్నారట.

ఈ సినిమా చిరు కి సరిపోవచ్చని దీనిని లైన్ లో పెట్టుకున్నారట. ఇక ఈ సినిమాని దర్శకుడు వి వి వినాయక్ తో చేయబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. దీనితో ఈ టాక్ విన్న మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పుడే విస్తు పోతున్నారు. మరి ఈ రీమేక్ సినిమాలు ఎప్పుడు ఆపుతారా అని మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ సినిమాలు మాత్రం వారు ఆపట్లేదు.