ఇండస్ట్రీ టాక్ : రీమేక్స్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్న మెగాస్టార్?

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర రీమేక్ చిత్రాలు కానీ ఆ చిత్రాలు చిత్రం హీరోల బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ లు గాని ఎలా ఉంటున్నాయి అనేది చూస్తున్నాము. ఊహించని రీతిలో దారుణమైన డౌన్ ఫాల్ ఆ హీరోకి తప్పడం లేదు. రీసెంట్ గా వచ్చిన మెగాస్టార్ చిత్రం “భోళా శంకర్” దెబ్బ అయితే మరో కోలుకోలేని దానిగా మారింది.

కాగా ఈ చిత్రం విషయంలో మెగాస్టార్ ముందే చెప్పారు నేను రీమేక్ లు చేయకూడదు అనుకుంటే ఇదెక్కడా లేదు అంటేనే చేశాను అని కానీ ఊహించని విధంగా ఇది ఇలా కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ మళ్ళీ మెగాస్టార్ ఓ రీమేక్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ ఉండగా దీనితో పాటుగా ఓ కొత్త రూమర్ సినీ వర్గాల్లో బయటికి వచ్చింది.

ఈ మధ్యలో మలయాళంలో భారీ హిట్ అయ్యిన ఓ సబ్జెక్టు తో చిరు దగ్గరకి ఓ నిర్మాత రీమేక్ చేద్దాం అని వెళ్లగా ఈ సినవిషయంలో మెగాస్టార్ అయితే ససేమిరా నో చెప్పేశారట. ఇపుడు తాను రీమేక్ చిత్రాలు చేయకూడదు అని అనుకుంటున్నాను అని అందుకే వారికి నో చెప్పి వెనక్కి పంపేసినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

అయితే ఇది ఎంతవరకు నిజం కానీ ఇదే నిజం అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ కంటే ఆనందించేవాళ్ళు ఇంకొకరు ఉండరు. కాగా ఇప్పుడు అయితే మెగాస్టార్ రెండు భారీ సబ్జెక్టు లు ఓకే చేయగా వాటిలో తన కూతురు సుష్మిత కొణిదెల బ్యానర్ లో ఓ సినిమా చేయనుండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో బింబిసార దర్శకుడు వశిష్టతో ఓ భారీ చిత్రాన్ని చిరు ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు.