‘వీరయ్య’ వేడుకల్లో ఏపీ పాలిటిక్స్ పై మెగాస్టార్ సెటైర్స్.!

Waltair_Veerayya_review_1673599384472_1673599401867_1673599401867

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన మొట్టమొదటి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా మెగాస్టార్ చిరంజీవి అలాగే మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” అని చెప్పాలి.

మెగాస్టార్ రేంజ్ హిట్ అయ్యిన ఈ చిత్రం భారీ లాభాలు కూడా అందించింది. కాగా ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా సెన్సేషనల్ రన్ 200 రోజులు కంప్లీట్ చేసుకోగా చిత్ర యూనిట్ అయితే ఓ విజయోత్సవ సభని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇందులో మళ్ళీ తనకి పాత జ్ఞ్యాపకాలు గుర్తుకువచ్చాయి అని చిరు ఎంతో ఆనందం వ్యక్తం చేయగా..

ఇప్పుడు టాలీవుడ్ చుట్టూ నడుస్తున్న ఏపీ పాలిటిక్స్ కోసం కూడా చిరు స్పందించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరికి అంటూ ప్రత్యక హోదా కోసం కానీ పేదలకు కడుపు నింపే పనులు గాని ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాలు కలిగించడం వంటివి చేస్తే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ తలవంచి నమస్కరిస్తారు.

కానీ అలాంటిది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు టాలీవుడ్ ఇండస్ట్రీ మీద టార్గెట్ చేస్తారేంటండి అంటూ మెగాస్టార్ సెటైర్స్ వేశారు. దీనితో చిరు పొలిటికల్ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కి ఆనందం రప్పించగా సినీ వర్గాల్లో కూడా ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక మెగాస్టార్ నటించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” అయితే ఇప్పుడు రిలీజ్ కి రాబోతుంది.