అత‌న్ని ఆకాశానికి ఎక్కించ‌డానికేనా మెగాస్టార్ ఆఫ‌ర్..లైఫ్ ఛేజింగ్ ఆఫ‌రే ఇది!

Chiranjeevi

మెహ‌ర్ రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి లైఫ్ చేంజింగ్ ఆఫ‌ర్ ఇచ్చారా? ఆ సినిమా హిట్ అయితే మెహ‌ర్ రేంజ్ మారిపోనుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది చిరంజీవి 152వ సినిమా. ఈ సినిమా త‌ర్వాత మ‌రో రెండు..మూడు సినిమాలు కూడా వెంట‌నే చేయ‌నున్నారు. ఇందులో వేదాళం రీమేక్ ఒక‌టి. ఇటీవ‌లే ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా మెహ‌ర్ ర‌మేష్ ని ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

chiranjeevi-ramesh
chiranjeevi-ramesh

ఇదే నిజ‌మైతే..సినిమా చేసి హిట్ కొడితే మెహ‌ర్ ర‌మేష్ జీవిత‌మే! మారిపోవ‌డం ఖాయ‌మ‌న్న టాక్ ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. మ‌రి ఈ ఆఫ‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కే ఎందుకిచ్చిన‌ట్లు? అంటే ఆస‌క్తిక‌ర సంగతులే బ‌య‌ట‌కొస్తున్నాయి. మెహ‌ర్ ర‌మేష్ కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్, వెంక‌టేష్, ప్ర‌భాస్ లాంటి స్టార్ హీరోల‌తోనే సినిమా చేసారు. కానీ ఆయ‌న చేసిన సినిమాలేవి క‌మ‌ర్శియ ల్ గా స‌క్సెస్ కాలేదు. క‌మ‌ర్శియ‌ల్ హంగులు స్ర్కిప్ట్ లో ధారంళంగానే జొప్పించినా క‌లిసిరాలేదు. పైపెచ్చు ఆ సినిమాల‌న్నీ భారీ బ‌డ్జెట్ ల‌తో తెర‌కెక్కిన‌వే. నిర్మాత‌ల్ని ఆర్ధికంగా దెబ్బ‌తీసిన‌వే. దీంతో మోహ‌ర్ ర‌మేష్ డైరెక్ట‌ర్ కెరీర్ డైల‌మాలో ప‌డింది. వ‌రుస ప్లాప్ ల నేప‌థ్యంలో అవ‌కాశాలు రాలేదు.

చాలా మంది హీరోల చుట్టూ స్ర్కిప్ట్ ప‌ట్టుకుని తిరిగినా క‌నిక‌రించ‌లేదు. చివ‌రికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త‌శిరోద్క‌ర్ వ‌ద్ద ఉద్యోగానికి చేరారు. కొన్నేళ్ల‌గా మ‌హేష్ సినిమాల‌కు సంబంధించిన ప‌నులు..బిజినెస్ వ్య‌వ‌హారాలు చేసుకుంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఇంకా ఆయ‌న అక్క‌డే జాబ్ కొన‌సాగిస్తున్నారు. అయితే ఇంత‌లోనే వేదాళం స్ర్కిప్ట్ కి మెగాస్టార్ మెహ‌ర్ ని ఎంపిక చేసారు. ఇక్క‌డ మ‌రో బ‌ల‌మైన కార‌ణంగా ఒక‌టుంది. మెహ‌ర్ ర‌మేష్ మెగా కుటుంబానికి చాలా ద‌గ్గ‌ర బంధువు. ఈ విష‌యాన్ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓ వేదిక‌పై ప‌బ్లిక్ గానే చెప్పాడు. మెహ‌ర్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేసాడ‌ని..అందుకు చాలా సంతోషంగా ఉంద‌ని నాగ‌బాబు సంతోషం వ్య‌క్తం చేసారు. ఆ స‌మ‌యంలో సినిమాలు హిట్ అయితే మెగా హీరోలే మెహ‌ర్ కి ఛాన్స్ ఇచ్చేవారు. కానీ ఆ ఛాన్స్ అప్పుడు అందుకోక‌పోయినా ఇప్పుడా బాధ్య‌త‌ను మెగాబాస్ తీసుకుంటున్నారు.