ఇండస్ట్రీ టాక్ : నాగ్ డైరెక్టర్ తో చిరు నుంచి సాలిడ్ ఎంటర్టైనర్ అట.!

Waltair-Veerayya-Cinima-unit-gave-another-official-update-960x540

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా దర్శకుడు మెహర్ రమేష్ తో భారీ చిత్రం “భోళా శంకర్” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కాగా  మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” అనే సినిమాతో భారీ హిట్ కొట్టారు. దీనితో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన మెగాస్టార్ నుంచి మళ్ళీ ఫ్యాన్స్ ఈ రేంజ్ ఎంటర్టైనర్స్ ని ఆశిస్తున్నారు.

అయితే దర్శకుడు బాబీ ఎలాగో చిరు కి పెద్ద ఫ్యాన్ కాబట్టి తన హీరోని అదిరే లెవెల్లో ప్రెజెంట్ చేసాడు. పైగా మెగాస్టార్ నుంచి ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కామెడీ టైమింగ్ కూడా కనిపించింది. దీనితో చిరు నుంచి ఈ తరహా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్స్ వస్తే చాలు అనుకుంటున్నారు.

మరి ఇప్పుడు భోళా శంకర్ తర్వాత అయ్యితే చిరు మరో స్ట్రైట్ సినిమాతో రానున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వస్తుంది. మరి ఈసారి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో అయితే తాను రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కినేని నాగార్జున తో “సోగ్గాడే చిన్ని నాయన”, “బంగార్రాజు” లాంటి మంచి ఎంటర్టైనెర్స్ ఇచ్చిన తాను మెగాస్టార్ ని ఒప్పించినట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ సినిమా కూడా ఒక పక్కా ఎంటర్టైనర్ అన్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే మళ్ళీ మెగాస్టార్ నుంచి అదిరే ఎంటర్టైనర్ రాబోతుంది అని చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించినట్టుగా తెలుస్తుంది.