లేటెస్ట్ : నాని “దసరా” పై మెగాస్టార్ రివ్యూ.!

Dasara-Still-7-1024x576

తెలుగు సినిమా దగ్గర తమ స్వయం కృషి తో భారీ స్టార్డం తెచ్చుకున్న హీరోస్ లో మొదట మెగాస్టార్ చిరంజీవి నిలవగా నెక్స్ట్ మాస్ మహారాజ రవితేజ అలాగే నాచురల్ స్టార్ నాని లు ఉంటారని చెప్పాలి. మరి మెగాస్టార్ ప్రేరణ తోనే నాని రవితేజ లు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

మరి తాజాగా అయితే నాని నటించిన సాలిడ్ పాన్ ఇండియా సినిమా “దసరా” తో తన కెరీర్ లో సెన్సేషనల్ హిట్ ని తాను కొట్టగా ఇప్పటికి రెండు వారల రన్ ఈ సినిమా థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. మరి ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తన రివ్యూ అందించడం వైరల్ గా మారింది.

మరి మొదటిగా సినిమా కోసమే మాట్లాడుతూ సినిమా నేను చూశానని చాలా బ్రిలియెంట్ గా ఈ సినిమా ఉందని స్టార్ట్ చేశారు. అలాగే నాని అయితే తన మేకోవర్ మరియు నటన తో ఆకట్టుకున్నాడని అంతే కాకుండా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక కొత్త దర్శకుడు అని తెలియడం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక హీరోయిన్ కీర్తి సురేష్ మా మహానటి వావ్ అనిపించేలా కనిపించింది. సంతోష్ నారాయణన్ సంగీతం కూడా బాగుంది అని అలాగే నటుడు దీక్షిత్ శెట్టి తన పరిధిలో బాగా నటించాడు అని మెగాస్టార్ తన మార్క్ రివ్యూ అందించారు. దీనితో నాని ఫ్యాన్స్ సహా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిత్ర యూనిట్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.