దసరా సినిమాతో ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న నాని నెక్స్ట్ హాయ్ నాన్న అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదొక డిఫరెంట్ టైం ట్రావెల్ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాని దృష్టిలో కొంతమంది ప్రముఖ దర్శకులు కూడా ఉన్నారు. అందులో వివేక్ ఆత్రేయ ప్రాజెక్టు కూడా నెక్స్ట్ స్టార్ట్ కాబోయే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది.
ఇంకా కథ అయితే ఫైనల్ కాలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్కులు జరుగుతున్నాయి. మరోసారి నాని దర్శకుడితో చర్చలు జరిపి అంతా ఓకే అయితేనే ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నారు. అలాగే మరో తమిళ దర్శకుడితో కూడా నాని సినిమా చేసే అవకాశం అయితే ఉంది.
అయితే ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేసిన మరో దర్శకుడు కూడా నానితో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాను తెరపైకి తీసుకువచ్చిన మోహన్ రాజా గత కొంతకాలంగా నానితో ఒక కథ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే రెండుసార్లు ఓ కథపై బాగా డిస్కస్ కూడా చేశారట. అయితే నాని మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. మళ్ళీ మరోసారి ఆ హీరో తోనే దర్శకుడు చర్చలు జరిపే అవకాశం ఉందట. ఇక కథ సెట్ అయితే మాత్రం మోహన్ రాజా మళ్ళీ తెలుగులోనే మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.