మెగా ఇన్ఫో : “చిరు 156” కోసం క్రేజీ లైన్ అట 

తెలుగు సినిమా మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి ఇదే ఏడాదిలో తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అలాగే తన కెరీర్ మరో భారీ డిజాస్టర్ ని అయితే నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక భోళా శంకర్ దెబ్బతో తన కెరీర్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకునున్న చిరు ఇక నెక్స్ట్ అన్ని స్ట్రైట్ సినిమాలే ఓకే చేశారు.

కాగా ఈ చిత్రాల్లో బింబిసార లాంటి ఓ సాలిడ్ ఫాంటసీ చిత్రాన్ని చేసి టాలీవుడ్ ఆడియెన్స్ ని మెప్పించిన దర్శకుడు వసిష్ఠతో భారీ సినిమాని తాను ప్లాన్ చేయగా ఈ సినిమాని అయితే మెగా ఫ్యాన్స్ అసలు ఊహించని లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

కాగా సినీ వర్గాల్లో లేటెస్ట్ మెగా ఇన్ఫో ప్రకారం అయితే ఈ సినిమాకి దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ లైన్ ని మెగాస్టార్ కోసం రాసుకున్నాడట. ఈ చిత్రంలో మెయిన్ కథ అంతా మూడు లోకాలలో తిరుగుతుంది అని అందులో ప్రేమ యాక్షన్ సహా భారీ ఫాంటసీ హంగులు కనిపిస్తాయని అంటున్నారు.

దీనితో ఓ ఇంట్రెస్టింగ్ లైన్ తో అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత చిరు రాబోతున్నారు అని చెప్పాలి. కాగా ఈ చిత్రంపై అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా తాను కూడా ఓ బిగ్ అప్డేట్ నిన్న అందించారు. అలాగే మేకర్స్ హీరోయిన్ హంట్ లో కూడా ఉన్నారు. కాగా ఈ చిత్రాన్ని అయితే యూవీ క్రియేషన్స్ వారు 200 కోట్లకి పైగా బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు.