స్నేహితులతో కలిసి ఫారెన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న మీనా… ఫోటోలు వైరల్!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి మీనా అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోల సరసన నటించిన ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగుతున్న సమయంలోనే ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి మీనా ఒక కూతురికి జన్మనిచ్చారు. అయితే తన కూతురు పెద్ద కావడంతో ఈమె కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా గడుపుతున్న సమయంలో తన భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఇలా తన భర్త మరణంతో ఎంతో కృంగిపోయిన మీనాకు తన స్నేహితులు ఇతర నటీమణులు ధైర్యం చెబుతూ తనని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే మీనా పుట్టినరోజు సందర్భంగా ఇతర నటీమణులు కలిసి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతున్నటువంటి మీనా మొదటిసారి తన భర్త మరణం తరువాత హాలిడే వెకేషన్ వెళ్లారు.

తన స్నేహితురాలు స్టైలిస్ట్ రేణుక ప్రవీణ్ తో కలిసి ఈమె హాలిడే వెకేషన్ కోసం ఫారిన్ ట్రిప్ వెళ్లారు.ఇలా నగర వీధులలో వీరిద్దరు కలిసి దిగినటువంటి ఫోటోలను, రీల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ ఫోటోలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత మీనాను ఇలా సంతోషంగా చూడటంతో తను ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఈమె తిరిగి మామూలు స్థితికి వచ్చారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.