అక్కడ.. మరో మాస్టర్ కావాలట

కరోనా లాక్ డౌన్ తరువాత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న చిత్రం మాస్టర్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో పాజిటివ్ టాక్ ను అందుకోకపోయినా కూడా కలెక్షన్స్ లో మాత్రం డోస్ తగ్గలేదు. తెలుగులో కూడా విజయ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నడు. కేవలం 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతున్నాడు.

vijay master movie review
 

అయితే సినిమాకు సంబంధించిన రీమేక్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మాస్టర్ సినిమాను తెలుగులోనే కాకుండా హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా అక్కడ పెద్దగా రెస్పాన్స్ ఏమి రాలేదు. అయితే బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఒక బడా ప్రొడ్యూసర్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీలైనంత వరకు కథలో మార్పులు చేసి స్టార్ హీరోతో తెరకెక్కుస్తే కాన్సెప్ట్ తప్పకుండా క్లిక్కవుతుందని ప్లాన్ వేస్తున్నారట.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ కథ బాగానే ఉన్నప్పటికీ విజయ్ స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకొని దర్శకుడు చేసిన కమర్షియల్ ప్రయోగాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. అదే సినిమాకు పెద్ద మైనెస్ అయినట్లు తెలుస్తోంది. ఖైదీ సినిమాను ఈ దర్శకుడు ఎలా తెరకెక్కించాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి బాలీవుడ్ లో మాస్టర్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.