కోలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ మాస్టర్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జనవరి 13న సౌత్ లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండగా జనవరి 14న హిందీలో ఒకరోజు ఆలస్యంగా విడుదల చేయనున్నారు. అయితే సినిమాలో అందరి చూపు విజయ్ సేతుపతి పైనే ఉంది. అతను మొదటిసారి చేసిన డిఫరెంట్ విలన్ రోల్ ఎలా ఉంటుందా అని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విజయ్ సేతుపతి సపోర్టింగ్ రోల్స్ చాలానే చేశాడు గాని అగ్ర హీరోల సినిమాల్లో ఇంతవరకు నెగిటివ్ పాత్రల్లో నటించింది లేదు. దర్శకుడు లోకేష్ కనగరాజన్ ఇతర హీరోలను కూడా విలన్ రోల్స్ కోసం సంప్రదించిన్నట్లు అప్పట్లో టాక్ గట్టిగానే వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వెళితే సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మాస్టర్ సినిమాకు పని చేసిన రత్న కుమార్ ఒక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రలో మొదట నేచురల్ స్టార్ నానిని అనుకున్నట్లు చెప్పాడు. అతను కాకపోతే మాధవన్ ను అయినా ఫిక్స్ చేయాలని భావించారట. ఎందుకంటే విజయ్ సేతుపతి ఒప్పుకోడనే అనుమానంతో ఆ హీరోల పేర్లను అనుకున్నట్లు చెప్పారు. అయితే నిర్మాతల కోరిక మేరకు విజయ్ సేతుపతి భారీ రెమ్యునరేషన్ ను అందుకొని సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.