మాసివ్ అప్డేట్ : నాగార్జున “నా సామిరంగ” కూడా డేట్ లాక్ చేసుకున్నాడు 

తెలుగు సినిమా దగ్గర సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా అతి పెద్ద సినిమా మూమెంట్ టైం ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. కాగా ఈ రానున్న 2024 సంక్రాంతికి అయితే గతంలో ఎన్నడూ లేని విధముగా అత్యధిక నెంబర్ సినిమాలు వస్తున్నాయి.

ఇక తెలుగు నుంచే దాదాపు నాలుగైదు సినిమాలు ఉంటే మరోపక్క కోలీవుడ్ నుంచి కూడా మూడు నాలుగు సినిమాలే ఉన్నాయి. దీనితో ఈ పోటీ చాలా ఆసక్తిగా మారిపోయింది. ఇక ఈ చిత్రాల లిస్ట్ లో గత కొన్ని రోజులు నుంచి ఊరిస్తూ వస్తున్నా చిత్రం “నా సామిరంగ” కూడా ఇప్పుడు డేట్ ని ఫిక్స్ చేసేసుకుంది.

కింగ్ నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన ఈ చిత్రం ఓ కన్నడ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. అలాగే ఇది నాగ్ కెరీర్ లో 99వ సినిమా కావడంతో గట్టి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం డేట్ తప్ప మిగతా సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా డేట్ ని అనౌన్స్ చేయగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఫైనల్ గా సినిమా రిలీజ్ ని ఫిక్స్ చేసేసారు.

కాగా ఈ చిత్రానికి మేకర్స్ ఈ జనవరి 14 డేట్ ని లాక్ చేసి అనౌన్స్ చేశారు. దీనితో ఈ సినిమా ఆ డేట్ లో సోలోగా రాబోతుంది అని చెప్పాలి. మరి ఈ హీట్ లో కింగ్ నాగ్ తనకి అచ్చొచ్చిన సంక్రాంతి బరిలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. ఇంకా ఈ సినిమాలో అలాటి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా నటిస్తుండగా ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.