ఫస్ట్ టైం “ధమాకా” కి మాస్ టీఆర్పీ రేటింగ్.!

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లాస్ట్ రెండు సినిమాలు ఒకదాన్ని మించి భారీ హిట్ లుగా నిలవగా ఆ చిత్రాల్లో దర్శకుడు త్రినాథరావు నక్కిన తో ప్లాన్ చేసిన మాస్ ఎంటర్టైనర్ సినిమా “ధమాకా” కూడా ఒకటి.

మరి ఈ సినిమాలో యంగ్ టాలెంట్ హీరోయిన్ శ్రీ లీల కూడా బిగ్గెస్ట్ హైలైట్ కాగా ఈ సినిమా అప్పుడు థియేటర్స్ లో అలాగే నెక్స్ట్ ఓటిటి లో కూడా దంచి కొట్టిన ఈ సినిమా రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అయితే టీవీ లో కూడా వచ్చింది. మరి ఈ సినిమా ఓ రేంజ్ లో అయితే దుమ్ము లేపింది.

చాలా మంది కాస్త డౌట్ పడ్డారు కానీ ధమాకా ఏకంగా 10 కి పైగా టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ని రాబట్టింది. దీనితో మాస్ రేటింగ్ నమోదు అయ్యింది అని చెప్పాలి. ఇక మాస్ ప్రాజెక్ట్ కి అయితే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా తన సాంగ్స్ అన్ని అదిరే రేంజ్ లో హిట్ అయ్యాయి.

అలాగే రవితేజ కెరీర్ లో భారీ లాభాలు ఇచ్చిన సినిమాగా కూడా ఇది నిలిచింది. దీనితోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు కూడా వరుస రెండో 100 కోట్ల గ్రాస్ సినిమాని అందుకున్నారు. అలాగే శ్రీ లీల కి కూడా ఈ సినిమా అతి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. కాగా హైపర్ ఆది, రావు రమేష్, జైరాం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.