త్రిష విషయంలో మన్సూర్ మరో స్టేట్మెంట్..!

తమిళ సినిమా ప్రముఖ హీరోయిన్ పైగా స్టార్ స్టేటస్ ఉన్నటువంటి నటి త్రిష కృష్ణన్ లేటెస్ట్ గా చేసిన చిత్రం “లియో” భారీ హిట్ అయ్యింది. కాగా ఈ చిత్రంలోనే నటించిన కోలీవుడ్ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ ఆమె పట్ల చేసిన కామెంట్స్ నిన్న రాత్రి సమయంలో బయట రాగా అవి కాస్త పెను సంచలనంగా మారాయి.

దీంతో త్రిష సహా అనేకమంది తమిళ్ సినీ స్టార్స్ మన్సూర్ పై విరుచుకుపడ్డారు. కానీ ఈ కాంట్రవర్సీ పై మాత్రం మన్సూర్ మరో స్టేట్మెంట్ ని ఇవ్వడం వైరల్ గా మారింది. కాగా తాను ఈ స్టేట్మెంట్ నేనెక్కడా తప్పు మాట్లాడలేదు అని ఇన్నేళ్ళలో నేను చాలా మందికి చాలా చేశాను అది ఇప్పటికీ కొనసాగిస్తాను.

నేను అన్న కామెంట్స్ లో తప్పు లేదు త్రిష చూసిన వీడియో ఎడిట్ చేసింది మొత్తం వీడియో చూసి ఉంటే అసలు నిజం తెలిసి ఉండేది అని చాలా మందికి నేనేంటో తెలుసు అంటూ తనను తాను వెనకేసుకున్నాడు. దీనితో మన్సూర్ ఈ కొత్త స్టేట్మెంట్ త్రిష విషయంలో వైరల్ గా మారింది.

మరి ఆ వీడియో నిజంగా ఎడిట్ చేసిందేనా లేక ఇక చేసేది ఏమీ లేక మన్సూర్ తనని తాను ఇలా వెనకేసుకొస్తున్నాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఆల్రెడీ ఇద్దరికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇక ఫైనల్ గా ఏం తేలుతుందో ఎవరు ఇనోసెంట్ అనేది కాలమే నిర్ణయించాలి.