Manjula Ghattamaneni: కళావతి పాటకు హుక్ స్టెప్పులు వేసిన మంజుల…. వీడియో వైరల్!

Manjula Ghattamaneni:సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారీ వారి పాట.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ సినిమాని వచ్చే వేసవి సెలవలకు విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు. ఈ క్రమంలోని శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఫిబ్రవరి 13వ తేదీ కళావతి అనే పాట విడుదలైంది.

ఈ పాటకు సోషల్ మీడియాలో ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు. ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పాటకు ఎంతోమంది మహేష్ బాబు చేసిన హుక్ స్టెప్స్ వేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార, శేఖర్ మాస్టర్ పిల్లలు, హీరోయిన్ కీర్తి సురేష్,మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆ డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు చేసిన ఈ హుక్ స్టెప్స్ కి మహేష్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల తనదైన శైలిలో డాన్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియోని మంజుల ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోని ఈ డాన్స్ వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేయడమే కాకుండా ఈమె డాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఇక మంజుల నటిగా నిర్మాతగా దర్శకురాలిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.తాజాగా సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది చిత్రంలో కూడా మంజుల కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.