త్వరలోనే ఓటిటిలోకి ‘మంగళవారం’

Mangalavaram Movie Review

టాలీవుడ్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మంగళవారం. ఆర్‌ ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిల్ళై, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 17న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా డైరెక్షన్‌ పరంగా అజయ్‌ భూపతికి మంచి మార్కులు పడ్డాయి. ఇక థియేటర్‌ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌పై డిస్నీ నిర్వహకులు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 26న మంగళవారం రోజునే స్టీమ్రింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా కథలోకి వెళితే.. ఒక ఊర్లో ప్రతి మంగళవారం అక్రమసంబంధం కలిగివున్న జంట భయంకరంగా హత్యకు గురవుతుంటారు. వారి బండారాన్ని ఓ అగంతకుడు ఊళ్లో ఏదో ఒక గోడవిూద రాసి ఆ జంటను చంపుతుంటాడు. ఆ మిస్టరీని ఛేదించటానికి లేడీ ఎస్‌ఐ రంగంలోకి దిగుతుంది. కానీ ఊరు సహకరించదు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోటానికి ఊరఊªపరూ నడుంబిగించి రాత్రుళ్లు వెతకడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో ఆ ఊరుకి సంబంధించిన ఓ కుర్రాడు గోడవిూద రాస్తూ ఊరిజనానికి దొరికిపోతాడు. వాడ్ని తన్నీ స్టేషన్‌కి అప్పజెబుతారు. అయితే, మరణించిన శవాల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ప్రకారం చంపింది ఆ దొరికిన కుర్రాడు కాదు. దాంతో అతడ్ని పోలీసులు వదిలేస్తారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఏంటి..ఎవరు చంపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలినకథ.