90ఏళ్లు పూర్తి చేసుకున్న చిత్ర పరిశ్రమ.. మలేషియా వేదికగా వేడుకలు: మంచు విష్ణు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఈ వేడుకల ద్వారా ఫండ్‌ రైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ‘మా’ సభ్యుల బాగోగుల కోసం వాటిని ఉపయోగించనున్నామన్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన విూడియా సమావేశంలో మంచు మాట్లాడారు.

మలేసియా వేదికగా జులై నెలలో వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సినీ పెద్దలతో చర్చించి.. వారి ఆశీస్సులు తీసుకుని తేదీని ప్రకటిస్తాం. ఈ మేరకు జులైలో షూటింగ్‌లకు మూడు రోజులపాటు సెలవులు ఇవ్వాలని కోరాం. దీనిపై ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలోని ఐదు అసోసియేషన్లతో ‘మా’ ఒప్పందం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఘన కీర్తిని చాటి చెప్పేందుకే ఈ వేడుకల నిర్వహణ అన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు గొప్ప దశలో ఉంది. ఈ సమయంలో నటీనటులుగా ఉన్నందుకు గర్వపడుతున్నా. చిరంజీవికి పద్మవిభూషణ్‌ రావడం గర్వించాల్సిన విషయం అని మంచు తెలిపారు.