రెండో పెళ్లి తేదీ ఫిక్స్ చేసుకున్న మంచు మనోజ్…. ఆ రోజేనంటూ పోస్ట్!

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు వారి అబ్బాయిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో మంచు మనోజ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు అయితే గత కొంతకాలంగా ఈయన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా తన మొదటి భార్య ప్రణతికి విడాకులు ఇచ్చిన అనంతరం మనోజ్ రాజకీయ నాయకుడు కుమార్తె భూమా మౌనికతో రిలేషన్ లో ఉన్నారని గత కొంతకాలంగా వీరిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఇకపోతే మనోజ్ త్వరలోనే భూమా మౌనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయాన్ని నటుడు మనోజ్ సైతం సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు. కొత్త సంవత్సరంలో తాను తన జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నానని, ఈ సంతోషకరమైన శుభవార్తను మీ అందరితో జనవరి 20వ తేదీ పంచుకుంటానని తెలిపారు.ఇన్ని రోజులు నా గుండెల్లో భద్రంగా దాచుకున్న ఆ నిజాన్ని త్వరలోనే తెలియజేయబోతున్నానంటూ ఈయన తెలిపారు. అందుకు మీ ఆశీస్సులు కూడా కావాలని ట్వీట్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

మనోజ్ జనవరి 20వ తేదీ తెలియజేయబోయే ఆ విషయం ఏంటి ఈయన పెళ్లి తేది ఫిక్స్ చేసుకొని తన పెళ్లి తేదీని ఈరోజు ప్రకటించబోతున్నారా లేక తన కొత్త సినిమా గురించి ఏదైనా ప్రకటన ఇవ్వబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మనోజ్ మాత్రం తన రెండో పెళ్లి గురించే తెలియచేయబోతున్నారని తెలుస్తోంది. అయితే గతంలో కూడా భూమా మౌనిక గురించి మనోజ్ ను ప్రశ్నించగా జీవితానికి సంబంధించిన ఈ వార్తను మంచి రోజు చెబుతాను అంటూ ఈయన ఆ ప్రశ్నను దాటవేసిన విషయం మనకు తెలిసిందే.