సోషల్ మీడియా యుగంలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో మనల్ని వెయ్యి కళ్లు గమనిస్తూ ఉంటాయి. ఏదైనా తప్పు చేస్తే ఇట్టే పసిగట్టేస్తారు. తాజాగా జెమిని టీవీ ట్విట్టర్ హ్యాండిల్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తెలిసి చేశారో తెలియక చేశారో తొందరపాటులో చేశారో గానీ ఓ తప్పు చేసేశారు.
ఈ మధ్య కాలంలో అన్ని ఛానెల్స్‌కు సోషల్ మీడియా ఖాతాలున్నాయి. తమ తమ సినిమాలను ప్రదర్శించుకునే సమయంలో సోషల్ మీడియా ఖాతాలో కొన్ని క్విజ్ ప్రశ్నలను వదులుతారు. అలా నిన్న జెమిని టీవీ వారు దేనికైనా రెడీ చిత్రం ప్రసారం చేయగా ఓ ప్రశ్నను సోషల్ మీడియాలో సంధించారు. ఇక అది ఘోరమైన తప్పు. ఎందుకంటే ఏకంగా వారు సినిమాలోని హీరోనే మార్చేశారు.
దేనికైనా రెడీ సినిమాలో హీరో మంచు విష్ణు అయితే మనోజ్ పాత్ర పేరు ఏమిటి? అని అడిగారు. ఈ ట్వీట్ చూసిన మంచు మనోజ్ వారికి చురకలంటించాడు. నేను దేనికైనా రెడీయే కానీ ఆ సినిమాలో నేను లేను అంటూ కౌంటర్ వేశాడు. దీంతో తప్పు తెలుసుకున్న జెమిని టీవీ ట్విట్టర్ వారు తమ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ అంతలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జెమినీపై, మంచు విష్ణు కెరీర్‌పై చెప్పలేనన్ని మీమ్స్ వచ్చేశాయ్. ఆ హీరోకు ఉన్నవే రెండు మూడు హిట్లు, అవి కూడా గుర్తించకపోతే ఎలా ఉంటూ కామెంట్లు చేశారు.