వరుస సినిమాలతో బిజీ బిజీగా మమ్ముట్టి!

పాన్‌ ఇండియా ఇమేజ్‌ ఉన్న స్టార్‌ హీరోల్లో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఒకరు. ఈ ఏడాది తెలుగులో ‘ఏజెంట్‌’ సినిమాలో కీలక పాత్రలో మెరిశాడు మమ్ముట్టి. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఊహించని డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. మమ్ముట్టి ఇప్పటికే గేమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బజూక’లో నటిస్తున్నాడని తెలిసిందే. డీనో డెన్నిస్‌ కథనందిస్తూ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమా అప్‌డేట్‌ అందించి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ సారి హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు. ‘భ్రమయుగం’ టైటిల్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్‌ షురూ అయింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసి లుక్‌లో డార్క్‌ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకుని ఉన్నాడు. మమ్ముట్టి ఇప్పటికే మరో మూడు మలయాళ సినిమాలు కూడా చేస్తుండగా.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. ‘బజూక’ చిత్రంలో గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, సుమిత్‌ నావల్‌, సిద్దార్ధ్‌ భరతన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై బ్జడెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థియేటర్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ అండ్‌ సరిగమ బ్యానర్లపై డోల్విన్‌ కురియాకోస్‌ జిన్‌ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్‌ ఆనంద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిధున్‌ ముకుందన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం స్టైలిష్‌గా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన లుక్‌తో తెలిసిపోతుంది.