‘స్కంధ’ పరిపూర్ణమైన సినిమా అంటున్న మేకర్స్‌!

రామ్‌ ` బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ’స్కంద’. శ్రీలీల కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. సెప్టెంబరు 15న విడుదల అవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ థండర్‌ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ ఆవిష్కరించారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఓ పాత్ర ఇస్తే దానికి వంద శాతం న్యాయం చేయడానికి నిరంతరం తపన పడే హీరో రామ్‌. తన విశ్వరూపం థియేటర్లలో చూడండి. ’స్కంద’ పరిపూర్ణమైన సినిమా. అన్నిరకాల భావోద్వేగాలూ ఉంటాయి. గుండెల విూద చేయి వేసుకొని చూడండి. విూ అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు.

రామ్‌ మాట్లాడుతూ ‘ఐదేళ్ల క్రితమే మా కాంబో సెట్‌ కావాల్సింది. ఇన్నాళ్లకు కుదిరింది. బోయపాటి మొండిగా మాతో పనిచేయించుకొంటూ వెళ్లారు. ట్రైలర్‌లో చూసిన లుక్‌లోకి మారడానికి ఏడు గంటలు పట్టింది. తమన్‌ చాలా మంచి సంగీతాన్ని అందించారు. శ్రీలీలకు గొప్ప భవిష్యత్తు ఉందన్నారు. చాలామంది గొప్ప నటీనటులతో కలిసి పనిచే సే అవకాశం ఈ సినిమాతో నాకు దక్కిందన్నారు శ్రీలీల.