స్కూల్ మేనేజ్మెంట్ కోసం ‘మేజర్’ చిత్రం యూనిట్ ప్రత్యేక ప్రకటన

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు.

మేజర్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి గొప్ప ఆదరణ వచ్చింది. అలాగే స్కూల్ పిల్లలకు మేజర్ చిత్రం ఎంతగానో నచ్చింది. మేజర్ చిత్రం చూసిన విద్యార్ధులు చిత్ర యూనిట్ కు ప్రత్యేక సందేశాలు పంపిస్తున్నారు. ‘మేజర్ సందీప్ జీవితం తమకు ఎంతగానో ప్రేరణ కలిగించిదని తామూ మేజర్ సందీప్ లా ఆర్మీలో చేరి దేశం కోసం పోరాడతామని” విద్యార్ధులు,  కథానాయకుడు అడివి శేష్ తో పాటు చిత్ర యూనిట్ కు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మేజర్ చిత్ర యూనిట్ స్కూల్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి గ్రూప్ బుకింగ్స్ లో మేజర్ టికెట్ ధర 50 శాతం తగ్గించి చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

”మేజర్ చిత్రాన్ని నా కెరీర్ లో బిగ్గెస్ట్ ట్రిబుల్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందటికీ ధన్యవాదాలు. గత కొద్ది రోజులుగా చాలా మంది పిల్లలు నాకు వాయిస్ మెసేజులు పంపడం, ఫోన్ లు చేయడం, సోషల్ మీడియాలో వీడియోలు కనిపించడం జరిగింది. ఈ మెసేజుల్లో వున్న కామన్ గా ఒక సందేశం వుంది. పిల్లలందరూ ”మేమూ మేజర్ సందీప్ లా దేశం కోసం పోరాడుతాం, ఆర్మీలో చేరుతాం” అనడం చాలా ఆనందంగా అనిపించింది. మేజర్ ని అందరం చూడాలనుకున్నాం. కానీ పిల్లలకు మేజర్ ఇంతలా నచ్చుతుందని తెలియలేదు. ఇంకొంత మంది పిల్లలు మేజర్ సందీప్ జీవితాన్ని చూసి ప్రేరణ పొందాలి. ఇంకెంతో మంది పిల్లలు మేజర్ సందీప్ అవ్వాలనుకోవాలి.

అందుకే మేజర్ చిత్ర యూనిట్ ఒక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి గ్రూప్ బుకింగ్స్ లో టికెట్ ధర 50 శాతం తగ్గించి పిల్లలకు ఆఫర్ చేయాలని నిర్ణయించాం. దీని లక్ష్యం ఒక్కటే. రేపటి భవిష్యత్ కి మేజర్ సందీప్ కథ తెలియాలి, మేజర్ సందీప్ గురించి చెప్పాలనేదే మా ఉద్దేశం. majorscreening@gmail.com ఈమెయిల్అడ్రస్ కి మీ స్కూల్ తరుపున ఒక ఈమెయిల్ పంపండి.  టికెట్ ధర 50 శాతం తగ్గించి అ థియేటర్ లో మీకు, మీ పిల్లలకి మేజర్ సినిమా చూసే అవకాశం దొరుకుతుంది. ఇదే సమయంలో కొన్ని ఎంపిక చేసిన స్కూల్స్ లో పిల్లలతో కలవడానికి నేను వస్తాను. మేజర్ సందీప్ గురించి ఇంకెన్నో విషయాలు పిల్లలతో పంచుకుంటాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథని చూడటానికి మీ స్కూల్ రావాలని కోరుకుంటున్నాను.