మేజర్ మూవీ మరొక కొత్త రికార్డు.. ఆ ఏరియాలో మొదటి స్థానంలో మేజర్!

విలక్షణ నటుడు అడవి శేషు హీరోగా తెరికెక్కిన మేజర్ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అడవి శేషు శోభిత ధూళిపాల ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి ప్రేక్షకతలను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన నాటి నుండి మంచి హిట్ టాక్ తో దూసుకుపోయింది.

ఈ సినిమా విడుదలైన మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ ని కంప్లీట్ చేసింది. మేజర్ సినిమా ఈ నెల 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మేజర్ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు అక్కడ నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా సినిమా మరొక కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సౌత్ ఏషియాలో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో నెంబర్1 స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో కొనసాగుతోంది. అడవి శేషు కథ స్క్రీన్ ప్లే అందించిన మేజర్ సినిమా అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పటివరకు రూ. 29.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.64 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉండగా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB ఈ సినిమాకి 9.2 / 10 రేటింగ్ ఇచ్చింది. మేజర్ ఉన్నికృష్ణన్ పేరుతో అడవి శేషు ఫండ్ రైజింగ్‌కు ప్రారంభించారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా CDS & NDA లో చేరాలనుకునే అభ్యర్ధుల కోసం ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన ఎంతోమంది యువకులు సమయంలో చేరాలని ఆశపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అడవి శేషుకి కామెంట్లు చేశారు.