దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ నటిస్తున్న రొమాంటిక్ చిత్రం ఖుషి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. అయితే, నిర్వాణ ఇప్పటికే తన తదుపరి ప్రాజెక్ట్‌ను నాగ చైతన్యతో ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా స్క్రిప్ట్‌తో దర్శకుడు నాగ చైతన్యను సంప్రదించాడని సమాచారం.
ఇక చైతూ ఆ ప్రాజెక్ట్‌కి తన అనుమతి ఇచ్చాడని తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ఎటువంటి క్లారిటీ లేనప్పటికీ, ఈ వార్త ఇప్పటికే చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారింది. శివ నిర్వాణ మరియు నాగ చైతన్య గతంలో 2019 హిట్ చిత్రం మజిలీలో కలిసి పనిచేశారు. ఇందులో సమంత కూడా నటించారు. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను అలరించింది. అలాగే విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.
ఇక ఈసారి నాగచైతన్యకు జోడిగా దర్శకుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు అనేది చూడాలి. మరోవైపు నాగ చైతన్య యొక్క తదుపరి చిత్రం కస్టడీ, మే 12 న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. నాగచైతన్య మరో రెండు ప్రాజెక్ట్‌ల చర్చల్లో కూడా బిజీగా ఉన్నాడు. ఇక శివ నిర్వాణతో ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్ అవుతుందనేది చూడాలి.
మొత్తానికి, నాగ చైతన్య, శివ నిర్వాణ కాంబినేషన్లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే మరో విజయవంతమైన చిత్రం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మేకర్స్ నుండి ప్రాజెక్ట్ గురించి అధికారిక కన్ఫర్మేషన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.