నాచురల్ స్టార్ నాని వీ సినిమా సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా కీ రోల్ లో నటించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఇది నాని 25వ సినిమా. ఈ సినిమాలో అదితి రావ్ హైదరి, నివేత థామస్ హీరోయిన్స్ గా నటించగా… సుధీర్ బాబు పోలీస్ పాత్రలో నటించాడు. అయితే.. ఈ సినిమాలో నానిది విలన్ పాత్ర అని తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి అయినా.. కరోనా రావడంతో విడుదల వాయిదా పడింది. ఇంకా థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
సెప్టెంబర్ 5న వీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే.. ఈ సినిమా గురించి మరో టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది.
ఈ సినిమాలో నాని హీరో కాదట. ఆయనది కేవలం గెస్ట్ రోల్ మాత్రమేనట. వీ సినిమాలో నాని కనిపించేది కేవలం 25 నిమిషాలేనట. కానీ.. మూవీ యూనిట్ మాత్రం ఇది నాని సినిమా అని చెప్పుకొని ప్రమోషన్స్ చేసుకుంటోంది.. అంటూ వార్తలు వస్తున్నాయి.
తన భార్యను చంపేసిన వాళ్లను వెతుక్కుంటు మరీ చంపుతూ.. అక్కడ వీ అనే ఒక మార్కును వదిలి వెళ్తూ పోలీసులకు దొరకకుండా తిరుగుతుంటాడు నాని. ఈ కేసు బాధ్యతను తీసుకున్న సుధీర్ బాబు ఈ కేసును చేధించి నానిని పట్టుకుంటాడని.. ఇదే సినిమా స్టోరీ అని సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.
అయితే.. మరో స్టోరీ ప్రకారం.. పోలీసు ఆఫీసరుగా ఉన్న సుధీర్ బాబే అసలు విలన్ అని.. నాని సినిమా మొత్తం విలన్ లా కనిపించినా.. తర్వాత సుధీర్ బాబు అసలు విలన్ అని తెలుస్తుందని మరో స్టోరీ వైరల్ అవుతోంది.
ఏది ఏమైనా.. సినిమాలో నాని పాత్ర నిడివి మాత్రం చాలా తక్కువ అని.. అమెజాన్ ప్రైమ్ కు నాని సినిమా అని చెప్పి అంటగట్టారని ఫిలింనగర్ టాక్. అందుకే ఈ సినిమాను మంచి డీల్ కు మాట్లాడుకొని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నాని సినిమా అయి ఉంటే ఖచ్చితంగా ఓటీటీలో రిలీజ్ చేసేవారు కాదు.. అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి.. ఇది నిజమా కాదా అనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 5 దాకా ఆగాల్సిందే.