చేనేత కార్మికులకు సహాయం చేసిన మహేష్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ఇటీవలే సర్కారీ వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు తదుపరి సినిమాపై దృష్టిని పెట్టిన విషయం తెలిసిందే. మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలయ్యింది. ఇకపోతే మహేష్ బాబు కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి ప్రాణదానం చేసి అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరోగా నిలిచాడు.

ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి అభిమానుల మనసులను చరగని ముద్రను వేసుకున్నాడు. కేవలం ఆయన కాకుండా ఆయన భార్య నమ్రత కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు ఆయన భార్య నమ్రత కలిసి తెలంగాణ నారాయణపేట చేనేత కార్మికులకు అండగానివిచారు. ఆరుణ్య నారాయణపేట అనే పేరుతో ఏకంగా ఓ వెబ్ పోర్టల్ నడుపుతున్నారు. అక్కడ సమీపంలో ఉండే మహిళలు ఆ వెబ్ పోర్టల్‌లో చేనేత చీరలతో పాటు రకరకాల క్రాఫ్ట్స్ అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి మహేష్ బాబు,నమ్రతల నుండి మద్దతు రావడంతో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇక మహేష్ నమ్రత దంపతులు వారిని కలిసి వారికీ సపోర్ట్ ను అందించారు. వారి వెబ్ పోర్టల్‌కు సంబంధించిన లింక్‌ను కూడా వారు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయంపై మహేష్ బాబు అభిమానులు మహేష్ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహేష్ బాబు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరొకవైపు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ,అలాగే బిజినెస్ విషయాలను కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.